గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఫోటో జర్నలిస్టులు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో జాతీయ దినపత్రికల ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పంజాబ్ కేసరి పత్రిక ఫోటో గ్రాఫర్ మిహిర్ సింగ్, నీరజ్ కుమార్(నవోదయ టైమ్స్ పత్రిక), విజయ్ కుమార్(దైనిక్ భాస్కర్ పత్రిక), దీపక్ రాజ్ పాల్(స్టేట్స్ మెన్ పత్రిక)తో పాటు మరికొన్ని దినపత్రికల ఫోటో జర్నలిస్టులందరు కలిసి మొక్కలు నాటారు.


 


అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు చాలా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. హరిత మహా యజ్ఞంలో తాము సైతం భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణ హితం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.